Pages

Elle Ilangkiliye in Telugu Meaning

Elle Ilangkiliye in Telugu Meaning
Thiruppavai Pasuram - 15 Telugu Meaning Text, Lyrics

అర్థము:బయటి గోపికలు:: ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ? అయ్యో ఇది ఏమి ?
లోని గోపిక:: పూర్ణులగు గోపికలారా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకండి..నేను ఇదే చెప్పుచున్నాను.
బయటి గోపుకలు:: నీవు చాలా నేర్పు కలదానవు. నీమాటలలో నైపుణ్యము కాఠిణ్యము మాకు ముందే తెలియును.
లోని గోపిక:: మీరే నేర్పు కలవారు..పోనిండు ! నేనే కఠినురాలను.
బయటి గోపిక:: నీకీ ప్రత్యేకత ఏమి? అట్లు ఏకాంతముగా ఎందుకు వుంటావు. వేగముగా బయటకు రా !
లోని గోపిక:: అందరు గోపికలు వచ్చినారా.
బయటి గోపికలు:: వచ్చిరి..నీవు వచ్చి లెక్కించుకో .
లోని గోపిక:: సరే..నేను వచ్చి నేను ఏమి చెయ్యాలి ?
బయటి గోపికలు:: బలిష్టమగు కువయాపీడము అను ఏనుగును చంపినవాడను శతృవుల దర్పమును అణచినవాడను..మాయావి అగు శ్రీ కృష్ణుని కీర్తిని గానము చెయుటకు రమ్ము..లెమ్ము మాతో వచ్చి చేరుము అని లోపలి గోపికను లేపినారు.


No comments:

Post a Comment