Pages

Erra Kalangkal in Telugu Meaning

 Erra Kalangkal in Telugu Meaning
Thiruppavai Pasuram - 21 Telugu Meaning Text, Lyrics


గోపికలు పురుష అహంకార భుతురాలగు నీలాదేవిని మేలుకోలిపిరి.ఆమె మేలుకొని "నేను మీలో ఒక్కదానినికదా! నన్ను ఆశ్రయించిన మీకేనాడు లోపముండదు.రండి! మనమందరమూ కలసి శ్రీ కృష్ణుని మేల్కొల్పి అర్దింతము." అని తానూ వచ్చి గోపికలతో శ్రీకృష్ణ భగవానుని సమీపమునకు వారిని తోడ్కొనిపోయి మేలుకొలుపు జొచ్చెను.

ఈ విధముగా శ్రీ కృష్ణుని మేలుకోల్పుతున్నారు.

పొదుగు క్రిందనుండి కడవలు చరాచర నిండి,పొంగిపొరలి నట్లు ఆగక,పాలు స్రవించు అసంఖ్యకములగు,ఉదారములగు,బలసిన ఆవులుగల నందగోపుని కుమారుడా! మేల్కొనుము. ప్రమాణదార్ఢ్యముగల పరబ్రహ్మస్వరూపా ! ఆశ్రితరక్షణ పృతిజ్ఞాధార్ఢ్యముగల మహామహిమ సంపన్నా! ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్స్వరూపా ! నిద్ర నుండి లెమ్ము.శత్రువులు నీపరాక్రమమునకు లోకి నీవాకిటికి వచ్చి నీ దాసులై నీపాదారవిందముల నాశ్రయించినట్లు మేముకూడా నిన్ను వీడి యుండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి.గోపికలు వారి పరిస్తితిని శ్రీ క్రిష్ణునికి నివేధించినారు.

No comments:

Post a Comment