Pages

Karavaikal Pin cenru in Telugu Meaning

Karavaikal Pin cenru in Telugu Meaning
Thiruppavai Pasuram - 28 Telugu Meaning Text, Lyrics

గోపికలు శ్రీ కృష్ణునితో అన్నారు మేము మార్గ శీర్ష స్నానము చేయవలెనని వచ్చాము.మాకు మా వ్రతమునకు కావలసిన పరికరములు అడిగారు.ఆ వ్రతము చేసిన తర్వాత తామూ పొందవలసిన ఆభరణములను,వస్త్రములను,భోగములను ప్రార్దిమ్చినారు .
శ్రీ కృష్ణునకు వారు హృదయము తెలియును.ఇదంతయు లుకిక వ్రత గాధ కాదు.వీరు కోరునవి లుకిక వ్రతోపకరనములు కావు. ఆముష్మిక ఫలమునండుతకే వీరు కోరుచున్నారు.కాని వీరి నోటివేమ్తనే దానిని చెప్పిమ్చవలెను అని తలంచి ఇట్లు అడిగినారు.
ఓ గోపికలారా ! మీరు కోరినవన్నియు చాలా చక్కగా వున్నాయి.మీరు " పరిశీలించి కృపచేయమని" అనిఅన్నారు.
కదా పరిశీలించినా మీ అభిప్రాయమేమో నాకు తోచటంలేదు.వ్రతము చేసి మహత్తరమైన అలంకరనములను భోగములను అందవలెనన్నా దానికొక అదికారము ఉండాలి కదా? ఫలమునాశించిన మీరు ఆ ఫలాప్రాప్తికి ఏదోఒక యత్నము కుడా చేసి యుండాలి కదా? మా కది కావాలని అన్నంత మాత్రమున నేను ఇచ్చుటకు వీలుకాదు.దానికి తగిన యోగ్యతా మీకున్న ఇవ్వగలను.కావున మీకున్న అధికారము అనగా మీ యోగ్యతా ఎట్టిదో వివరించుము.ఫలమును అందగోరు వారు దానికి సాధనమునుగూడ సంపాదిమ్పవలేనుగాడా? మీరు అట్టి సాధనమును దేనినైనా ఆర్జించినారా ?
ఇట్లు అడుగగానే గోపికలు తమ హృదయము విప్పి చెప్పుచున్నారు.
గోపికలు కామ్క్షిమ్చునది పరమ పుశార్ధముఅగు నారంట భగవత్ పురక భవత్కైమ్కర్యము.దానికి వరేమియు యోగ్య తను సంపాదించుకొని రాలేదు.పరమాత్మే ఉపాయముగా నమ్మిన వారు,వాటి కంటే వేరే ఉపాయము తాము పొందుటకు ప్రతిభందకములని తెలుసుకున్నవారు.కర్మలు చేసి,జ్ఞానము సంపాదించి,భక్తి తో ఉపాసించి పరమాత్మను పొందాలని తలంపు వీరికి లేదు.వాడె వానిని పొందించ వలెనని నమ్మినవారు.అందుచే ఇట్లు భగవానుడే యుపాయమని నమ్మకము కలవారు.భగవానుని ముందు ఏమి విజ్ఞాపనము చేయవలెనో ఆమాటలను గోపికలు ఈ పాసురమున వివరిచుచున్నారు.

అర్థము::

పశువుల వెంట వానిని మేపుటకై అడవికిపోయి. అచటనే శుచినియమములు లేక తిని,జీవిమ్చియుమ్డుతయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము.ఏమియు జ్ఞానములేని మాగోప వంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మిచిన పుణ్యమే మాకున్న పుణ్యము. మాకెన్ని లోపాలున్నా తీర్చగాల్గినట్లు ఏ లోపము లేని వాడవు కదా నీవు.గోవిందా! ఓ స్వామీ ! నీతో మాకుగల సంబంధము పోగొట్టుకోన వీలుకాదు.లోక మర్యాదనేరుగని పిల్లలము.అందుచే ప్రేమవలన నిన్ను చిన్న పేరు పెట్టి పిలచినాము.దానికి కోపము తెచ్చుకొని మమ్ములననుగ్రహింపక ఉండకుము.మాకు ఆపేక్షితమగు పరను పరను ఇవ్వుము.

No comments:

Post a Comment