Pages

Kuththu Vilakk in Telugu Meaning

Kuththu Vilakk in Telugu Meaning
Thiruppavai Pasuram - 19 Telugu Meaning Text, Lyrics

ముందు పాశురములో పొడుగు జుట్టు గల నీలాదేవి ని మేల్కొల్పి.ఈ రోజు నీలాదేవిని మేలుకొలిపినా ఈ పాశురములో శ్రీ కృష్ణుని,నీలాదేవిని కూడా మేలుకోల్పవలసినది గా అర్ధించుచున్నారు.లేచి వారితో మాటాలాడమని కోరుకొని నీలాదేవిని అర్ధిస్తున్నారు కాసేపు అయినా మాతో మాటాడనీ అంటున్నారు. మరి ఎలా అన్నది తెలుసుకుందాం.నీలాదేవిని కీర్తిస్తున్నవారు ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు
అర్థము::
ఒక గుత్తి దీపములు చుట్టును వేలుగుచుండగా,ఏనుగు దంతము లతో చేయబడిన కోళ్ళు గల మంచముపై నున్న,చల్లదనము, మెత్తదనము,తెల్లదనము,ఎత్తు,వెడల్పు కలిగిన పాన్పులపై ఎక్కి,గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకోనిన కేశ పాశము గల నీలాదేవి యొక్క స్థనములపై తన శరీరమును ఆనుకొని పరుండి విశాలమైన వక్షస్థలము గల శ్రీ కృష్ణా నోరు తెరచి మాట్లాడు.కాటుక పెట్టికోనిన విశాలమైన కన్నులు కల ఓ నీలాదేవి ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీవు?ఇంత మాత్రపు ఎడబాటుకుడా ఓర్వ లేకుండుట నీ స్వరుపమునకు,నీ స్వభావమునకు తగదు.

No comments:

Post a Comment