Pages

Maale Manivanna in Telugu Meaning

Maale Manivanna in Telugu Meaning
Thiruppavai Pasuram - 26 Telugu Meaning Text, Lyrics


శ్రీ కృష్ణ పరమాత్మ గోపికల మాటలకు పరమానందము తో వారిని చుచుతూ ఉండిపోయాడు.వారి పాసురము పాసురము మండలమును,నేత్ర ములను,వక్షస్థలమును,నడుమును చూచుచు ఇతర స్పృహ లేనంతగా వ్యామోహముతో పరవశమై ఉన్నాడు.వారి మాటలు విని మరి కొన్ని వినాలన్న కోరికతో ఒక ప్రశ్న అడిగెను " గోపికలారా ! నన్నే కోరి వచ్చాము అని చెప్పారు.మరలా నీకిష్టమైనచో పర అను వాద్యమును ఇమ్మని అంటున్నారు.నన్నే కలియవలేనని కోరిక ఉన్నవారు వేరోక దానిని కాంక్షించారు కదా? మీరు పర అడుగుటలో ఉద్దేశ్యము ఏమి? మీ కోరిక విషయములో నాకు సందేహముకలుగుతున్నది.అని శ్రీ కృష్ణుడు వారిని ప్రశ్నించెను.వారు దానికి భగవద్ ప్రీతి కొరకు మా పెద్దలు ధనుర్మాస వ్రతము చెయ్యమన్నారు.మేము పెద్దల యెడ ఉపకారబుద్ధితో ఈ వ్రతము ఆచరించ బూనినాము.అని గోపికలు చెప్పారు.
అంత శ్రీ కృష్ణ పరమాత్మ సరే కానిండు.అయితే ఆవ్రతము ఏమి ? దానికి ప్రమాణము ఏమి ? దానికి కావలిసిన పదార్ధాలు ఏమి ? అవి ఎన్ని కావాలి? వివరాలు తెలపండి.అని అడిగెను.అంత గోపికలు ఈ వ్రతమునకు కావలసిన పరికరములు అర్ధించుచున్నారు.ఈ పాశురములో

అర్థము::
ఆశ్రిత వ్యామోహముకలవాడా! ఇంద్ర నీలము అను మణిని పోలిన కాంతియు, స్వభావమును కలవాడా! అఘటిత ఘటనా సామర్ధ్యముచే చిన్న మర్రియాకుపై అమరి పరుండువాడా ! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరాలు అర్ధించి నీ వద్దకు వచ్చితిమి.ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు.నీవు విన్నచో దానికి కావలసిన పరికరాలు విన్నవించేదము.ఈ భూమండలమంతను వణుకుచున్నట్లు శబ్ధము చేయు,పాలవలె తెల్లనైన,నీ పాంచజన్యమనబడే శంఖమును పోలిన శంఖములు కావలెను.విశాలమగు చాలా పెద్ద "పర " అను వాద్యము కావాలి మంగళ గానము చేయు భాగవతులు కావాలి.మంగళ దీపములు కావాలి.ధ్వజములు కావాలి.మేలుకట్లు కావాలి.పై పరికరములు ను క్రుపచేయుము అని గోపికలు శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి.సర్వ శ క్తిమంతుడవై మాకోరకు శ్రీ కృష్ణుడు వై సులభుడవైన నీవు మాపై దయ చూపి మా వ్రతమునకు కావలసిన పరికరములు నోసగుమని గోపికలు ఈ ప్రాసురమున ప్రార్ధించినారు

ఈ అర్థమును లహరి బ్లాగునుండి స్వీకరించినది

2 comments

  1. వ్రతముల గురించి మరింత సమాచారం కొరకు ఈ క్రింది లింకుని చూడండి.
    http://www.samputi.com/launch.php?m=home&l=te

    ReplyDelete