Pages

Maayanai in Telugu Meaning

Maayanai Telugu in Meaning
Thiruppavai Pasuram - 5 Telugu Meaning Text, Lyrics

అర్థము :
శ్రీకృష్ణ నామ గానంతో సర్వపాపహరణం
మాయగాడై తిరుగుతూ ఉత్తరమధురను కాచునట్టి వాడూ, గోపికలతోగూడి యమునాతీరంలో విహరించేవాడూ, గోకులంలో జన్మించి తల్లి కడుపును పండించినవాడూ, అయిన గోపాలకృష్ణుని మనమందరం మంచి మనస్సుతో సమీపించి, దాసానుదాసులమై పూలతో పూజించుదాం. నోరారా గానంచేస్తూ భక్తిభావంతో ధ్యానిస్తే, ఇటు గతంలో చేసిన పాపాలూ అటు భవిష్యత్తులో రాగల పాపాలు అన్నీ అగ్నికి తగిలిన దూదివలె కాలిపోతాయి. కనుక గోవిందుని కల్యాణ గుణ లీలా విశేషాలను, శ్రీనామాలను గానం చేయటమే ఉత్తమం. ఇదే కదా మన వ్రతం అంటు గోపికలకు ఆండాళ్ విన్నవించుకొంటున్నది .

తాత్పర్యము :
ఆశ్చర్యమగు చేష్టలు కలిగిన వాడు, నిత్యము భగవద్ సంబందము గల ఉత్తర దేసమందలి మధురా నగరికి నిర్వాకుడును, పవిత్రమైన జలముగల యమునా నది రేవు తనకు గుర్తుగా కలవాడును, గోపవంసమున ప్రకాశించిన మంగళ దీపము అయిన వాడును, యశోదా మాత చె తాడు తో బంధింపబడిన శ్రీ కృష్ణునికి పవిత్రమైన పుష్పాలతో నమస్కరించి మనసారా కీర్తించి ధ్యానించి మన పూర్వ సంచిత పాపరాసియు . ఆగామి పాపరాసియు , అగ్నిలో పడిన దూది వలె భాస్మమైపోవును. కావున భగవానుని నామాలు పాడుడు.

No comments:

Post a Comment