Pages

Naayakanaay Ninra in Telugu Meaning

Naayakanaay Ninra in Telugu Meaning
Thiruppavai Pasuram - 16 Telugu Meaning Text, Lyrics

గోపికలు నిద్ర పోతున్న పదిమంది గోపికలను మేల్కొల్పి నంద గోప భవనమునకు చేరిరి. పదిమంది మాత్రమె కాదు..ఆనందముతో శ్రీ కృష్ణుని పొందే యోగ్యత కలగోపికలను అందరను మేలుకొలిపి నంద గోప భావనమునకు వచ్చిరి. నందగోపుని ద్వారమునకు వచ్చి ద్వార పాలకుని అర్ధించి లోన ప్రవేసింతురు .

అర్థము:అందరకు నాయకునాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భావనపాలకా లోనికి విడువుము..తోరనములతో శోభిస్తున్న ద్వారమును కాపాడుతున్న ద్వారపాలకా మణులచే అందముగా వున్నా గడియలను తెరువుము..గోపబాలికలగు మాకు మాయావి అయిన మణివర్ణుడగు శ్రీ కృష్ణ పరమాత్మ ద్వని చేయ "పఱ " అను వాయిద్యము ను ఇచ్చెదనని నిన్న నేను మాట ఇచ్చాను . మేము వేరొక ప్రయోజనము కాంక్షించి రాలేదు. పవిత్రమైన భావముతో వచ్చాము..శ్రీ కృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకు వచ్చినాము..స్వామీ ముందుగానే నీవు కాదనకు..దగ్గరగా ప్రేమతో ఒకదానినిఒకటి చేరి బిగువుగా పట్టుకొని వున్న తలుపులను నీవే తెరచి మమ్ములను లోనకు పోనిమ్ము..అని భావనద్వార పాలకులను గోపికలు వేడుకొన్నారు.

No comments:

Post a Comment