Pages

Ungkal Puzhaikkataith in Telugu Meaning

Ungkal Puzhaikkataith in Telugu Meaning
Thiruppavai Pasuram - 14 Telugu Meaning Text, Lyrics

ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని..మిగిలిన వారిని కూడా లేపెదనని చెప్పిన ఒక గోపిక మేల్కొల్పబడుచున్నది . ఈమె వీరి సంఘమున కంతకు నాయకురాలై నడిపించగల శ క్తిగాలది .
తన పూర్వ అనుభావముచే ఒడలు మరచి తానూ చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరిచి ఇతర గోపికలను మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తానూ ఉండిపొయినది .
ఈమె ఇంటిలో ఒక పెద్ద తోట గలదు..పెరటివైపున వున్నా ఆ తోటలో దిగుడు బావికలదు..ఆ దిగుడు బావిలో తామర పూలు..కాలువలు..ఉన్నవి ఆమె తన్మయత్వముతో అనుభావిచుచు ఇతరంలనే మచి ఉన్నది..అట్టి స్థితిలో ఉన్నా గోపికను నేడు మేల్కొల్పుతున్నారు .

అర్థము :
స్నానము చేయుటకు గోపికల నందరను లేపుదునని చెప్పి నిద్రించుచున్న ఒకామె ను ఇందు మేల్కొల్పుచున్నారు . ఓ పరిపుర్ణురాలా ! నీ పెరటి తోటలో దిగుడుబావిలోని ఎర్రతామరాలు వికసించినవి కాలువలు ముడుచుకోపోతున్నవి లెమ్ము ! ఎర్రని కాషాయములను దాల్చి తెల్లని పల్లువరస కలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమతమ ఆలాయములలో ఆరాధన చేయుటకు పోతున్నారు లెమ్ము..మమ్ములను ముందుగానే మేల్కొని వచ్చి లేపుదనని మాట ఇచ్చావు మరచావా ?
ఓ లజ్జావిహీనురాలా లెమ్ము ! మాట నేర్పు కలదానా ! శంఖమును..చక్రమును ధరించిన వాడును..ఆజాను భాహువును అయిన పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు రమ్ము.

No comments:

Post a Comment