Pages

Unthu MathakaLirran in Telugu Meaning

Unthu MathakaLirran in Telugu Meaning
Thiruppavai Pasuram - 18 Telugu Meaning Text, Lyrics

అర్థము ఏనుగులతో పోరాడగలిగినవాడును,మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలముకలవాడును,మదము స్రవించుచున్న ఏనుగులు కలవాడును,యుద్దములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా ! సుగంధము వెదజల్లు కేశ పాశము గల ఓ నీలాదేవి ! తలుపు గడియ తెరువుము.కోళ్ళు అంతటా చేరి అరుస్తున్నాయి.మదవీలతప్రాకిన పందిరిమీద గుంపులు గుంపులుగా కూర్చొని కోకిలలు కూస్తున్నాయి.కావున తెల్లవారినది,చూడు.బంతిని చేతిలో పట్టుకోన్నదానా! మీ బావ గుణములను కీర్తించుటకు వచ్చితిమి.నీవు సంతోషముతో లేచి నడచి వచ్చి.ఎర్ర తామర పూలు ను పోలిన నీ చేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము.

అని నీలాదేవిని కీర్తిస్తున్నారు..ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు.

No comments:

Post a Comment