Pages

Maari Malai Muzhainycil in Telugu Meaning

Maari Malai Muzhainycil in Telugu Meaning
Thiruppavai Pasuram - 23 Telugu Meaning Text, Lyrics



అననన్య గతికలమై వచ్చి నన్నాస్రయించినారము,కటాక్షిం చుము అని గోపికలు ప్రార్ధించగా శ్రీ కృష్ణునకు మనస్సులో చాలా భాద కలగినది.నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా నన్నాశ్రయించిన వారిని నేనే ముందుగా వెళ్లి సాయపడి రక్షించవలసి ఉండగా వేరొక గతిలేని వారమైనాము అని దైన్యముగా పల్కు నట్లు ప్రేరేపించితినే ! ఎంత తప్పు చేసితిని అని శ్రీ కృష్ణుడు చాలా నోచ్చుకోనేను.
ఇలా పడుకున్న శ్రీ కృష్ణుని లేచి నడచి వచ్చి ఆ స్థానమున సింహాసనమున వేంచేసి తమ కోరికవిని క్రుపచేయవలేనని గోపికలు ప్రార్ధించుచున్నారు.
అర్థము 
పర్వత గుహలో వర్షాకాలములో కదలక మెదలక పడుకున్న సౌర్యముగల సింహము మేలుకొని,తీక్ష్ణమగు చూపులు నిటునటు చూచి , ఒకవిధమగు వాసనగల తన ఒంటి వెంట్రుకలు నిగుడు నట్లు చేసి,అన్ని వైపులా దొర్లి,దులుపుకొని,వెనుకకు ముందుకు శరీరమును చాపి,గర్జించి,గుహనుండి వేల్వడునట్లు, ఓ అతసీపుష్ప సవర్ణ ! నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకు వేంచేయి రమణీయ సన్నీవేశము గల లోక్కోత్తరమగు సింహాసనమును అధిష్టించి మేము వచ్చిన కార్యమును ఎరుగ ప్రార్ధించుచున్నాము.
అలా కోరటంతో శ్రీ కృష్ణ పరమాత్మ తన శయనాగారమును వీడి నడచి వచ్చి సింహాసనము నధిరోహించి గోపికలను యుక్తరీతిని పలుకరించవచ్చునని అనుకోవచ్చును.

ఈ అర్థము లహరి బ్లాగునుంది సెకరించినది

No comments:

Post a Comment