Pages

Pullum Silambina Kaan in Telugu Meaning

Pullum Silambina Kaan in Telugu Meaning
Thiruppavai Pasuram - 6 Telugu Meaning Text, Lyrics

అర్థము : ఈ వ్రతము చేయుటకు గోపికలందరూ అత్యుత్సాహము తో వున్నారు..కొందరు అస్సలు నిద్రపోకుండా మెలకువగా వున్నారు..కృష్ణ ప్రేమ పొందాలని చాలా కోరికతో కలలు కంటున్నారు కొందరు..మరి కొందరు భగవంతుని ప్రేమ పొందుతున్నట్లు కలలు కంటూ మత్తుగా నిద్ర పోతున్నారు..ఆహా కృష్ణుడు కేవలము నా వాడే అనే తలంపుతో మగత నిద్రపోతున్నారు గోపకాంతలు.
కొందరైతే అస్సలు నిద్ర పోవటం లేదు..మరి కొందరు నిద్ర పోతున్నారు..అసలు శ్రీ కృష్ణుని ప్రేమ అందరికి సమానమే..మరి భగవంతుని గుణగణాలు మట్టులాంటివి..అవి నిద్రను కలిగిస్తాయి .
ఆ నిద్రనుండి లేవని వారి పట్ల కుడా కృష్ణుని ప్రేమ ఎక్కువే. వారిని మన గోదాదేవి నిద్రలేపి వారి మనస్సులో వున్నా దోషాలను వారికి కమ్ము కున్న పొరలను తొలగిస్తుంది..భగవంతనుగ్రహము పొందేలా చేస్తుంది.

No comments:

Post a Comment